![]() |
![]() |

ముకేష్ గౌడ పేరంటే ఎవరికీ తెలీదు కానీ రిషి సర్ అంటే చాలు చాలామందికి ఇట్టే అర్థమైపోతుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో కాలేజీ లెక్చరర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సాయంత్రం స్టార్ మాలో 7 గంటలకు వచ్చే క్యూట్ లవ్ స్టోరీ ఇది. వసుధారా , రిషి సర్, మహేంద్ర, జగతి ఈ కేరక్టర్స్ తో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది.
ఇందులో రిషి సర్ గా ముకేష్ గౌడ్, వసుధారగా రక్షా గౌడ్ నటిస్తున్నారు. వీళ్లిద్దరు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ తమ అప్ డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిషి తన మూడ్స్ ని రకరకాల యాంగిల్స్ లో సెల్ఫీస్ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. "నాకు అద్దాలంటే ఇష్టం ఎందుకంటే అవి నన్ను ప్రేమిస్తాయి" అనే కాప్షన్ తో రిషి తన పిక్స్ ని పోస్ట్ చేసాడు.
![]() |
![]() |